[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-18th-brics-summit-chinese-president-jinping-visits-india-after-seven-years":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":36,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":37,"read_next":40,"sponsored_content":106},5865,2081,"18th-brics-summit-chinese-president-jinping-visits-india-after-seven-years","18వ బ్రిక్స్ సదస్సు.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాక!","భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ (BRICS) అధినేతల శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం భారత్‌కు చేరుకున్నారు. 2019లో తమిళనాడులోని మామల్లపురంలో జరిగిన దౌత్య సదస్సు తర్వాత, దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం షీ జిన్‌పింగ్ భారత గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ca8244d-27f9-4631-8efc-ab1624420eb6.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ca8244d-27f9-4631-8efc-ab1624420eb6.png","Mamatha puppala","international","routine",[19,20,21,22,23,24,25,26],"XiJinping","BRICSSummit2026","PMModi","India","ChinaTies","NewDelhi","GlobalDiplomacy","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T08:51:04+00:00","2026-09-12T08:51:21+00:00",106,"\u003Cp>\u003Cspan>\u003Cstrong>&nbsp;\u003C\u002Fstrong>భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ (BRICS) అధినేతల శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం భారత్‌కు చేరుకున్నారు. 2019లో తమిళనాడులోని మామల్లపురంలో జరిగిన దౌత్య సదస్సు తర్వాత, దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం షీ జిన్‌పింగ్ భారత గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆయన పర్యటన కోసం భారత్ ప్రత్యేక దౌత్య, భద్రతా ఏర్పాట్లు చేసింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ ప్రతిష్టాత్మక పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు దాదాపు 400మంది ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, వాణిజ్య దిగ్గజాలతో కూడిన భారీ ప్రతినిధి బృందం భారత్‌కు వచ్చింది. 2019 పర్యటనతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ప్రతినిధులు రావడం ఈ పర్యటన ప్రాధాన్యతను చాటుతోంది. భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి చైనా పెద్దపీట వేస్తోంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;2020 గాల్వాన్ లోయ సరిహద్దు ఉద్రిక్తతల తదనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, గత కొంతకాలంగా సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణ, పెట్రోలింగ్ ఒప్పందాల దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గాల్వాన్ ఘటన తర్వాత దైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఇరు దేశాలు శ్రమిస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్ రాక దౌత్యపరంగా ఎంతో ప్రాముఖ్యమైనది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ప్రత్యేక ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో వాస్తవ అధీన రేఖ (LAC) వద్ద శాంతి భద్రతలు, సరిహద్దు నిర్వహణ, ఆర్థిక-వాణిజ్య సంబంధాల మెరుగుదల, ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించే అవకాశముంది. ఈ భేటీ ఆసియా ఖండంలో భౌగోళిక రాజకీయ స్థిరత్వానికి సరికొత్త దిశను నిర్దేశిస్తుందని అంతర్జాతీయ దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"Screenshot 2026-09-12 141935.png",[],"https:\u002F\u002Fx.com\u002Fians_india\u002Fstatus\u002F2098663524700701120?s=20",{"title":38,"description":39},"18వ బ్రిక్స్ సదస్సు.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు","భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ (BRICS) అధినేతల శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేం",[41,49,55,63,69,76,83,90,95,100],{"slug":42,"title":43,"category":44,"image":45,"author":46,"read_time":27,"published_at":47,"public_read_count":48},"farmers-take-to-the-streets-where-is-the-24-hour-electricity","TG : రోడ్డెక్కిన రైతాంగం.. 24 గంటల కరెంట్ ఎక్కడ?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6f60d20-15df-4791-b564-24cfa9b2c7df.jpg","Kumar","2026-09-12T08:59:38+00:00",157,{"slug":50,"title":51,"category":44,"image":52,"author":46,"read_time":27,"published_at":53,"public_read_count":54},"hit-again-commuters-up-in-arms-over-rtc-fare-hikes","TGSRTC : మళ్లీ బాదారు.. ఆర్టీసీ చార్జీలపై ప్రయాణికుల గగ్గోలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F05e01f9b-aeba-480f-aa84-bcbf7baf0b97.jpg","2026-09-12T09:22:27+00:00",208,{"slug":56,"title":57,"category":44,"image":58,"author":59,"read_time":60,"published_at":61,"public_read_count":62},"bjp-telangana-assembly-group-politics-internal-rift-mlas","BJP : అసెంబ్లీ సాక్షిగా కమలంలో కల్లోలం.. కాషాయ దళంలో ముదురుతున్న గ్రూపుల లొల్లి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2981f4c-fd6a-4c0d-a055-3b736a06400f.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-12T09:34:05+00:00",55,{"slug":64,"title":65,"category":44,"image":66,"author":46,"read_time":27,"published_at":67,"public_read_count":68},"mention-of-konda-in-the-mock-assemblyhere-is-what-the-cm-said","BRS : మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc29c1846-1129-40a1-a773-f6d08aed4767.jpg","2026-09-12T09:47:57+00:00",463,{"slug":70,"title":71,"category":72,"image":73,"author":59,"read_time":74,"published_at":75,"public_read_count":62},"bigg-boss-telugu-winners-reality-tragedy-career-shivaji-success","Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f14a4f7-372a-4c6a-ac91-1c1424f4e9ee.jpg","7 నిమిషాల పఠనం","2026-09-12T10:05:32+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":46,"read_time":81,"published_at":82,"public_read_count":48},"silent-killer-killed-his-wife-and-children-then-served-tea-to-his-father","Crime : సైలెంట్ కిల్లర్.. భార్యబిడ్డలను చంపేసి తండ్రికి టీ ఇచ్చి..!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffe6c4cad-fb2e-432c-af5d-70839647dcb3.jpg","3 నిమిషాల పఠనం","2026-09-12T08:34:32+00:00",{"slug":84,"title":85,"category":44,"image":86,"author":15,"read_time":87,"published_at":88,"public_read_count":89},"dont-know-about-cusecs-only-know-about-bank-cheques-pallas-sarcastic-barbs-in-the-mock-assembly","'క్యూసెక్కులు తెలీవు.. బ్యాంకు చెక్కులే తెలుసు'.. మాక్ అసెంబ్లీలో పల్లా వ్యంగ్యాస్త్రాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9cd87941-0f5e-450a-b29f-bcff443d308b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-12T07:39:30+00:00",310,{"slug":91,"title":92,"category":44,"image":93,"author":15,"read_time":27,"published_at":94,"public_read_count":68},"150-tmc-of-water-into-the-sea-jagadish-reddy-lashes-out-in-the-mock-assembly","సముద్రంలోకి 150టీఎంసీలు.. మాక్ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ధ్వజం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e32e215-c2db-4ecc-a56a-c3871f3f6611.jpg","2026-09-12T07:21:44+00:00",{"slug":96,"title":97,"category":44,"image":98,"author":15,"read_time":27,"published_at":99,"public_read_count":48},"talasanis-barbs-in-the-mock-assembly-we-spoke-of-promises-within-100-days-but-did-we-specify-which-100-days","మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73aee595-844a-4b4a-995c-8ca8c61e0807.jpg","2026-09-12T06:57:09+00:00",{"slug":101,"title":102,"category":72,"image":103,"author":104,"read_time":27,"published_at":105,"public_read_count":62},"ssthaman","SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2d9e624-a4f3-4993-bf0c-b083962c1e27.webp","Anshu","2026-09-12T06:48:16+00:00",[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]